top of page
  • Facebook
  • Instagram
  • X
  • Youtube
  • LinkedIn

ప్రకృతి కార్యాలయం ప్రారంభోత్సవం

23 నవం, గురు

|

Govardhanapuram, Avanthi road, Govardhanapuram, Varadaiahpalem, Andhra Pradesh 517541, India

Registration is closed
See other events
ప్రకృతి కార్యాలయం ప్రారంభోత్సవం
ప్రకృతి కార్యాలయం ప్రారంభోత్సవం

Time & Location

23, నవం 2023 9:00 AM

Govardhanapuram, Avanthi road, Govardhanapuram, Varadaiahpalem, Andhra Pradesh 517541, India

About the event

ప్రకృతి కాటేజ్ ఇండస్ట్రీ విజయవంతమైన మైలురాయికి సూచిక: 

నవంబరు 23,2023 వరల్డ్ విలేజ్ క్రిష్ణాపురంలో ముందెన్నడు లేని విజయోత్సాహం విల్లువిరసింది. ప్రకృతి కాటేజ్ ఇండస్ట్రీ క్రిష్ణాపురంలో స్త్రీ శక్తిని నిరూపిస్తూ, కొందరు మహిళలు కన్న అధ్భుతమైన కల. వారి కలను సాకారం చేసుకునేందుకు వారి గ్రామంలోనే కొత్త కార్యాలయాన్ని కలసి పని చేసేందుకు నిర్మించుకున్నారు. ఇక్కడ అన్ని, భూమాతకు పోషణనిచ్చి, రక్షణ ఇచ్చేటు వంటి గృహ సంబందిత ఉత్పత్తులే చేస్తారు. ఇది కేవలం ఒక భౌతిక కార్యాలయం ప్రారంభం మాత్రమే కాదు. కంటికి కనిపించని కొందరి మహిళా వీరులు, వారి తలరాతలను మార్చుకునేందుకు సాహసించినందుకు వారికి చేన పట్టాభిషేకపు వేడుక. 


ఈ మహిళలు, ఒకప్పుడు రోజు కూలీలకు మాత్రమే పరిమితమైనవారు. ధైర్యంగా కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. కూలీల నుండి ఇప్పుడు వ్యాపారవేత్తలుగా మారిపోయారు. ఒకప్పుడు ఇతరులకు పనిచేసిన చేసిన వారి చేతులు, ఇప్పుడు సుస్థిరత, సాధికారత కూడిన భవిష్యత్తును సృష్టించడానికి పనిచేస్తున్నాయి. వారి ప్రయాణం పూలబాట కాదు. ప్రతి అడుగులో ఎన్నో అవాంతరాలు, సవాళ్ళు ఎదుర్కొన్నారు, ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు. ఏమి జరిగినా వారి నిబద్దత, నిర్ణయం చెదరలేదు. ఈ మహిళలు ప్రేరణకు దివిటీలు. 


ఈ కొత్త ప్రకృతి కాటేజ్ ఇండస్ట్రీ ఈ మహిళలలోని  చెక్కుచెదరని భావాలకు ప్రతి రూపం. ఈ భావమే ప్రకృతి విస్తరాకులకు, సామూహికంగా ఆకుల ప్లేట్ల తయారీకి ఒక శాశ్వత స్థానం ఏర్పడింది. అంతేకాదు ఇక్కడ వారి పూర్వీకులు తరతరాలుగ ఉపయోగించే గృహ ఉత్పత్తులను, ఆధునికతతో జోడించి ముందు తరాలలో కూడా కొనసాగేల బద్రపరుస్తున్నారు. ఈ గృహప్రవేశం కేవలం కొత్త స్థలానికి మాత్రమే కాదు, వారి అంకితభావానికి వాంగ్మూలం. ప్రకృతి కాటేజ్ ఇండస్ట్రీ మనిషిలోని అనంతమైన శక్తిని, సామర్థ్యాన్ని వృద్ది చేయగలమని, సృష్టించగలమని, ప్రేరేపించగలమని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం.




Share this event

bottom of page